ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం జరిగిన జావెలిన్ త్రో అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుదిపోరుకు అర్హత సాధించాడు. రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. అటు ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ రౌండ్లో ఎల్డోస్ పాల్ 16.68 మీటర్ల దూరం దూకాడు. ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. ట్రిపుల్ జంప్ ఈవెంట్లో మరో ఇద్దరు భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబేకర్ పేలవ ప్రదర్శనతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళ్లితే… ఇండియా గోల్డెన్బాయ్ నీరజ్ చోప్రా వరల్ల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 2022లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నీరజ్‌తోపాటు మరో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఫైనల్‌కు అర్హత రౌండ్లలో భాగంగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 89.91 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానం నీరజ్ చోప్రా (88.39)దే. ఈ జాబితాలో రోహిత్ యాదవ్ 11వ స్థానం (80.42) మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే మహిళల ఈవెంట్లో అర్హత రౌండ్లో భారత అథ్లెట్ అన్నూరాణి కూడా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ ఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో ఎల్డోస్ 16.68 మీటర్ల దూరం దూకాడు. దాంతో గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచి ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే పోటీల్లో బరిలోకి దిగిన మరో ఇద్దరు భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబేకర్ ఫైనల్ చేరుకోలేకపోయారు. ప్రవీణ్ 16.49 మీటర్లతో గ్రూప్-ఏలో 8, ఓవరాల్‌గా 17వ స్థానం సాధించాడు. అబ్దుల్లా గ్రూప్-బిలో 10, మొత్తంగా 19వ స్థానంతో నిరాశ పరిచాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.