భారత బల్లెం వీరుడు, ఒలింపియన్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. ఈ మేరకు తన పెళ్లి వార్తను ప్రకటిస్తూ నీరజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘నేను జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, హర్యానాకు చెందిన హిమానీ…. అమెరికాలో చదువుకుంది. సౌత్ ఈస్టర్న్ లూసియానా విశ్వవిద్యాలయం నుండి విద్యను పొందిన హిమానీ… ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో టెన్నిస్‌లో పార్ట్ టైమ్ వాలంటీర్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసింది. అమ్హెర్స్ట్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, హిమానీ కాలేజీ మహిళా టెన్నిస్ టీమ్‌ను నిర్వహిస్తుంది.