టోక్యో ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ చోప్రా 89.30 మీటర్లు బల్లెం విసిరి జాతీయ రికార్డు నమోదు చేశాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో 88.07 మీటర్లు, టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు. 86.92 మీటర్లతో తొలి రౌండ్‌ను ప్రారంభించిన నీరజ్… తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. ఆఖరి ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు. దీంతో నీరజ్ చోప్రాకు రజత పతకం దక్కింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.