గుజరాత్‌లోని రాజ్‌కోట్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్విమ్మింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న 38వ జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా గోల్డ్ పతకం కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల శివాని అండర్-11 బాలికల 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించింది. శివాని 34.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్ రేసును శివాని 1:14:81 సెకన్లలో ముగించి సిల్వర్ మెడల్ గెలిచింది.
అనంతరం 4నాలుగుసార్లు 50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో శివాని, అన్నిక దెబోరా, మేఘన నాయర్, వేములపల్లి దిత్యా చౌదరీలతో కూడిన తెలంగాణ బృందం 2:12:31 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శివాని కర్రా మొత్తం 3 పతకాలు చేజిక్కించుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.