( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలోని పటమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్, ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ సంయుక్తంగా ఈనెల 24నుండి ప్రారంభం అయిన అండర్ 14 బాల, బాలికల సెపక్ తక్రా పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి.
బాలికల క్వార్టర్ ఫైనల్ లో నేడు జరిగిన పోరులో మణిపూర్ కి మణిపూర్, బీహార్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ జట్లు సెమీఫైనల్ కి ప్రవేశించాయి.
మణిపూర్ జట్టు గుజరాత్ తో తలపడగా.. 15-13,9-15,15-6 పాయింట్స్ తో గెలుపొందింది. ఇక తమిళనాడు జట్టుతో పోటీపడిన బీహార్ 5-15,2-15పాయింట్స్ తో విజయం సాధించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా మధ్య జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు 15-1,15-2 పాయింట్స్ తో గెలిచింది. ఉత్తరప్రదేశ్ – ఢిల్లీ మద్య జరిగిన పోరులో ఢిల్లీ 11-15,9-15 పాయింట్స్ తో గెలుపొందింది.
మరోవైపు బాలురు క్వార్టర్ ఫైనల్ లో ఢిల్లీ, పంజాబ్, మణిపూర్, గుజరాత్ జట్లు సెమీఫైనల్ కి చేరినాయి.
ఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో ఢిల్లీ 15-12,15-11 పాయింట్స్ తో విజయం సాధించింది. బీహార్ – పంజాబ్ జట్లు పోటీపడగా.. పంజాబ్ జట్టు 15-9,15-7 పాయింట్స్ తో విజయం సాధించింది. మణిపూర్ – ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో మణిపూర్ 10-15,7-15 జట్టు పాయింట్స్ తో, గుజరాత్ – తమిళనాడు మధ్య జరిగిన పోటీలో గుజరాత్ 15-4,15-3పాయింట్స్ తేడాతో గెలుపొంది సెమీఫైనల్ కి చేరినాయి.