హైదరాబాద్: జనవరి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని పుణెలో నేషనల్ రోయింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలోనే పాల్గొనే తెలంగాణ జట్టు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో మర్యాదకపూర్వకంగా భేటీ అయ్యింది. ఎల్బీ స్టేడియంలోని చైర్మన్ కార్యాలయంలో తెలంగాణ రోయింగ్ జట్టు సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లిపురం మాట్లాడుతూ వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రోయింగ్‌జట్టుకు చీఫ్‌కోచ్‌గా తెలంగాణకు చెందన ఇస్మాయిల్ వ్యవహరించారని, ఆయన తెలంగాణ జట్టులో భాగస్వామిగా ఉండటం సంతోషకరమన్నారు.
ఆయన విశిష్ట సేవలు రోయింగ్ క్రీడాకారులు ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కృషిచేయాలని అల్లిపురం కోరారు. అర్జున అవార్డు గ్రహీత సతీష్‌జోషి తెలంగాణ జట్టుకుకోచ్‌గా వ్యవహరించడం హర్షదాయకమన్నారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి ఇండియన్ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉండటం గర్వకారణమని ప్రశంసించారు.