Friday, November 22, 2024

AP | సెప్టెంబర్‌ 26 నుంచి నేషనల్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌..

సబ్‌-జూనియర్‌ బాయ్స్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ 2023-24 టోర్నమెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరం కేంద్రంగా సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు జరుగనుంది. ఈ టోర్నీమెంట్‌లో 21 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను ఏ, బీ, సీ, డీల పేరుతో 4 గ్రూపులుగా… ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. గ్రూపుల్లో రాణించిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) శనివారంనాడొక ప్రకటనలో పేర్కొంది. గ్రూపు-ఏలో తమిళనాడు, ఉత్తరాఖండ్‌, త్రిపుర, బీహార్‌, అండమాన్‌-నికోబార్‌, మధ్యప్రదేశ్‌ జట్లు. గ్రూప్‌-బీలో తెలంగాణ, జమ్ముకాశ్మీర్‌, ఢిల్లిd, ఛత్తీస్‌గఢ్‌, దాద్రా-నగర్‌ హవేలి. గ్రూప్‌-సీలో ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, సిక్కిం, లక్ష్యదీప్‌. గ్రూప్‌-డీలో పాండిచ్చేరి, చంఢీఘర్‌, నాగాలాండ్‌, లడఖ్‌, రాజస్థాన్‌ జట్లు ఉంటాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement