Saturday, November 23, 2024

నాదల్‌ విజయనాదం, స్టెఫీ గ్రాఫ్‌ రికార్డును సమం చేసిన వైనం

రఫెల్‌ నాదల్‌… విజయనాదం చేశాడు. నిన్న ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ను మట్టి కరిపించాడు. 6-3,6-3,6-0 తేడాతో ప్రత్యర్థిని ఓడించాడు. నాదల్‌ కెరీర్‌లో ఇది 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ కావడం గమనార్హం, మొత్తమ్మీద 22వ గ్రాండ్‌స్లామ్‌ను ఈ దిగ్గజం కైవసం చేసుకున్నాడు. తద్వారా ఒక నాటి టెన్నిస్‌ తార స్టెఫీ గ్రాఫ్‌ స్థాయికి చేరుకున్నాడు. పురుష సింగిల్స్‌లో గ్రాండ్‌ స్లామ్‌ ఘనత నాదల్‌కు మాత్రమే దక్కింది. ఇదొక విశేషం. అయితే ఇంకా అందనంత ఎత్తుకు ఎదగాలంటే మరో రెండు టైటిల్స్‌ను గెలుచుకోవాలి. ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను దక్కించుకున్న ఘనత ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్‌ కోట్‌ సొంతం. ఆ తర్వాతిస్థానం అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌కు దక్కింది.

ప్రశంసల జల్లు..

టెన్నిస్‌ దిగ్గజం, స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌పై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ మట్టికోర్టు మహారాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. 36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్‌, 22వ గ్రాండ్‌ స్లామ్‌ గెలవడం నిజంగానే ఓ అద్భుతం. ఇది అసాధారణ విజయం. కంగ్రాట్స్‌ నాదల్‌ అంటూ టీం ఇండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఇలా స్పందించాడు. టీం ఇండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పొగడ్తల్లో ముంచెత్తాడు. ట్విటర్‌ వేదికగా ఆయనకు విష్‌ చేశాడు. మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం నాదల్‌ను కొనియాడారు. ‘మట్టి కోర్టు రారాజు గొప్ప ఆటగాడు. చాంపియన్‌ నాదల్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 14వ టైటిల్‌ అంటూ నాదల్‌ ఫొటోెెను ట్వీట్‌ చేశాడు. నాదల్‌కు అభినందనలు తెలియజేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement