ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి విజయాల ఖాతా తెరిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆ జట్టుకిదే తొలి గెలుపు. దిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకొన్న రొమారియో షెఫర్డ్ కేవలం 10 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. నోకియా వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. తన ఇన్నింగ్స్‌పై స్పందించాడు.
”ఇన్నాళ్లు చేసిన కష్టానికి ప్రతి ఫలం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా. డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు దేని గురించీ ఆలోచించకూడదు. స్పష్టమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాలి. టిమ్ డేవిడ్‌తో కలిసి చివరి ఓవర్‌లో ఆడా. భారీగా హిట్టింగ్ చేయాలని అతడే చెప్పాడు. మైదానంలో ఒక్క వైపే పరుగులు రాబట్టాలని అనుకోలేదు. ఇలా బంతిని బాదాలంటే చాలా బలం కావాలి. బాగా తినడమే దానికి కారణం . అందులో ఇండియన్ ఫుడ్ కూడా ఉంది” అని రొమారియో వ్యాఖ్యానించాడు.