క్వాలిఫయర్ సెకండ్ రౌండ్లో భాగంగా ఇవ్వాల ముంబయి, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. అహ్మదాబాద్‌లోని స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే.. 7 గంటలకు వేయాల్సిన టాస్ వర్షం కారణంగా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. దీంతో 7.20 తర్వాత అంపైర్లు పిచ్‌ని పరిశీలించారు. అయినా వెట్ ఫీల్డ్ కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత ఇరు జట్లను సంప్రదించి వారి నిర్ణయం మేరకు టాస్ వేశారు.