14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 70 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కృనాల్ 39 పరుగులతో అతనికి సహకరించాడు. ఛేదనలో ముంబై ఏ దశలోనూ తడబడలేదు. రోహిత్(14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా డికాక్, కృనాల్ చెలరేగిపోయారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులుపెట్టించారు. రాజస్థాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ డికాక్ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్ రెండు వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. జోస్ బట్లర్(41: 32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), జైశ్వాల్(32: 20 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), సంజూ శాంసన్(42: 27 బంతుల్లో 5ఫోర్లు), శివమ్ దూబే(35: 31 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు.