Saturday, November 23, 2024

పంజాబ్‌ కింగ్స్‌ పై ముంబై ఇండియన్స్‌ విజయం

మోహాలీ వేదికగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ కొట్టింది. 215 పరుగుల కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసింది రోహిత్ సేన. 215 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. దీంతో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 75 పరుగులు ; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 66 పరుగులు ; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. కామెరూన్ గ్రీన్ (18 బంతుల్లో 23 పరుగులు ; 4 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో తిలక్ వర్మ (10 బంతుల్లో 26 పరుగులు నాటౌట్), టిమ్ డేవిడ్ ( 10 బంతుల్లో 19 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ విక్టరీతో ఈ సీజన్ లో పంజాబ్ తో ఎదురైన ఓటమికి లెక్క సరిచేసింది ముంబై. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. రిషి ధావన్, అర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు

అంతకు ముందు.ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ భారీ స్కోర్‌ సాధించింది మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి.. ముంబై ఇండియన్స్‌ ముందు 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటర్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 42 బంతులను ఎదుర్కొని 195 స్ట్రైక్‌ రేట్‌తో 82 పరుగులు రాబట్టాడు. అందులో 4 సిక్సర్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్‌కు వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ చక్కటి సహకారం అందించాడు. 27 బంతుల్లో 2 సిక్సర్‌లు, 5 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్‌లలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (30), మాథ్యూ షార్ట్‌ (27) రాణించారు. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేయలేకపోయాడు. పంజాబ్‌ బౌలర్లలో పీయూష్‌ చావ్లా పంజాబ్‌ కింగ్స్‌ పై ముంబై ఇండియన్స్‌ విజయం2 వికెట్లు, అర్షద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement