ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే.. ఇందులో సూర్యకుమార్ యాదవ్ 103* పరుగులతో రెచ్చిపోయి ఆడడంతో ఈ స్కోరు సాధ్యమయ్యింది. కాగా, 219 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కి దిని గుజరాత్ జట్టు ఆదిలోనే టఫ టఫా వికెట్లను పడేసుకుంది. దీంతో 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
కాగా, 9వ వికెట్ భాగస్వామ్యంలో రషీద్‌ఖాన్, జోసఫ్ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. పరువు పోతుందనుకున్న గుజరాత్‌కు సిక్స్‌లు, ఫోర్లతో రషీద్(79) పరుగులతో రాణించి కాపాడాడు. నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 191 పరుగులు మాత్రమే చేసి, 27 తేడాతో ముంబయిపై ఓటమిచెందింది. ఈ మ్యాచ్ గెలవడంతో ముంబయి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫాం చేసుకుని పాయింట్స్ పట్టికలో సుస్థిర స్థానం సంపాదించుకుంది.