Friday, November 22, 2024

IPL : ఆర్ఆర్‌తో ముంబై ఢీ

ఐపీఎల్ 2024 సీజన్‌లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నేటి రాత్రి జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాజస్థాన్ జట్టు సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించింది. అదే సమయంలో, మూడు వరుస ఓటములతో సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ వర్సెస్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఐపిఎల్ చరిత్రలో, ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 15-13 ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్ రద్దు అయింది. సంజు శాంసన్ రాజస్థాన్ టీమ్ కు అతిపెద్ద బలం. బ్యాటింగ్‌లో, జోస్ బట్లర్ గత మ్యాచ్‌లో చేసినట్లుగా, బ్యాటింగ్‌లోనూ ఎవరో ఒకరు ముందుకు వచ్చి బాధ్యత వహించి ఆటను ముగిస్తుంటారు. అదే సమయంలో బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ రాణిస్తున్నప్పటికీ హార్దిక్ పాండ్యా బ్యాట్ మాత్రం మౌనంగానే ఉంటున్నాడు. దీంతో పాటు అతని కెప్టెన్సీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

వాతావరణం:

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కనిపించింది. పిచ్‌లో ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం అందుతుంది. కానీ, భారీ బౌండరీల కారణంగా స్పిన్ బౌలర్లు కూడా మ్యాచ్‌లో మిగిలారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన 4 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 185 కంటే ఎక్కువగా ఉంది. వాతావరణం గురించి మాట్లాడితే, జైపూర్‌లో ఉష్ణోగ్రత 30-34 డిగ్రీలు ఉంటుంది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమెరియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement