Sunday, September 15, 2024

IPL : కెకెఆర్ తో ముంబై ఢీ

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ శనివారం తలపడనుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై జట్టు ఓదార్పు విజయం కోసం, మరోవైపు కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా కైవసం చేసుకోవడం కోసం పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

- Advertisement -

ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఓసారి తలపడ్డాయి. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత వాంఖడేపై కోల్‌కతా తొలిసారి గెలుపు రుచి చూడటం విశేషం. ఇప్పుడు సొంతగడ్డపై ముంబైతో శ్రేయస్ సేన మరోసారి తలపడటానికి సిద్ధమైంది. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో ముంబైకు మెరుగైన రికార్డు సొంతం.

ఈడెన్ వేదికగా ఆడిన 13 మ్యాచ్‌ల్లో ముంబై పదింట్లో గెలిచింది. చివరిసారిగా ఈ గడ్డపై 2019లో ఆడగా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే కేకేఆర్ భీకర బ్యాటింగ్ లైనప్‌కు బంతితో పాటు బ్యాటుతో కూడా రేపు సమాధానం చెప్పాలని ముంబై భావిస్తోంది. దానికి తగ్గట్లుగా తుదిజట్టులో మార్పులు చేయనుంది. కోల్‌కతాకు ప్రధాన బలం వాళ్ల ఓపెనింగ్ జోడీ.

ఈ సీజన్‌లో సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ 180 స్ట్రైక్‌రేటుతో 548 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలోనే వికెట్ల వేట మొదలుపెట్టాలని ముంబై ప్లాన్ చేస్తోంది. స్టార్ బౌలర్ బుమ్రాతో పాటు గత కేకేఆర్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన నువాన్ తుషారాపై అంచనాలు పెట్టుకున్నారు. అయితే బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్న నమన్ ధిర్‌కు బదులుగా ఎడమచేతి వాటం బ్యాటర్ నెహాల్ వదేరాకు ఛాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

అయితే ఈడెన్ గార్డెన్స్‌లో ఫామ్‌లో ఉన్న కేకేఆర్‌పై గెలవాలంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తిరిగి ఫామ్‌లో రావాలి. గత అయిదు ఇన్నింగ్స్‌లో హిట్ మ్యాన్ అత్యధిక స్కోరు 11 మాత్రమే. మరోవైపు ఇషాన్ తన చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 32 టాప్ స్కోర్. వీరిద్దరు తిరిగి ఫామ్‌లోకి వచ్చి, సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదు.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా)

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నెహాల్ వదేరా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్, పీయూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా.

Advertisement

తాజా వార్తలు

Advertisement