Sunday, October 27, 2024

కెకెఆర్ బ్యాటింగ్ లో ఒకే ఒక్క‌డు వెంక‌టేష్ అయ్యర్ – ముంబై టార్గెట్ 186

ముంబై – కోలకతా నైట్ రైడర్స్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ ధనాధన్ బ్యాటింగ్ చేయ‌డంతో నిర్దారిత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది.. ముంబై ఇండియ‌న్స్ గెలుపు కోసం 186 ప‌రుగులు చేయాల్సి ఉంది.. వెంక‌టేష్ ఈ సూప‌ర్ శతకంలో అయిదు ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి.. కేవలం 49 బాల్స్ లోనే ఈ సెంచురీ చేయడం విశేషం.. 104 ప‌రుగుల చేసి జాస‌న్ బౌలింగ్ లో అయిదో వికెట్ గా వెంక‌టేష్ ఔట్ అయ్యాడు.. ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి కోల్ కోతా నైట్ రైడ‌ర్స్ కి బ్యాటింగ్ అప్ప‌గించింది.. అయితే కెకెఆర్ కు శుభారంభం ల‌భించ‌లేదు.. వ‌రుస‌గా వికెట్లు పోగొట్టుకుంటున్న‌ది.. ఇక 17 ప‌రుగులు చేసిన శార్దూల్ ను నాలుగో వికెట్ గా షౌకిన్ ఔట్ చేశాడు.. అంత‌కు ముందు అయిదు ప‌రుగులు చేసిన కెకెఆర్ స్కిపర్ నితీష్ రానాను కూడా షోకిన్ పెవిలియ‌న్స్ చేర్చాడు.. ఇక బ్యాటింగ్ దిగిన కెకెఆర్ కు రెండో ఓవ‌ర్ల‌లోనే దెబ్బ‌త‌గిలింది.. క్యామ‌రూన్ గ్రీన్ బౌలింగ్ లో జ‌గ‌దీశ‌న్ ప‌రుగులేవీ చేయ‌కుండానే వెనుతిరిగాడు.. అనంత‌రం ఆయిదో ఓవ‌ర్ లో మ‌రో ఓపెన‌ర్ రెహ‌మానుల్లా గ‌ర్బేజ్ ఎనిమిది ప‌రుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు.. నితీష్ రానా మూడో వికెట్ గా , శార్దూల్ నాలుగో వికెట్ గా , వెంక‌టేష్ అయిదో వికెట్ , రింకూ సింగ్ 18 ప‌రుగులు చేసి ఆరో వికెట్ గా వెనుతిరిగారు .

కాగా, ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌కు IPL-2023 ప్రారంభం మంచిగా లేదు. మూడు మ్యాచ్‌లు ఆడి, అందులో రెండు ఓడిపోయింది. ఇప్పుడు ఈ జట్టు ఆదివారం తమ సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకి సిద్దమైంది. కోల్‌కతా మంచి రిథమ్‌లో ఉన్నప్పటికీ ముంబైని ఓడించడం అంత సులభం కాకపోవచ్చు. దానికి ప్రధాన కారణం ముంబై తన స్వంత మైదానంలో ఆడటమే.. ఈ మ్యాచ్ కూడా ఫ‌లితం చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.. ఇది ఇలా ఉంటే ముంబై రెగ్యూల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. అలాగే క్రికెట్ గాడ్ స‌చిన్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఈ మ్యాచ్ ద్వారా ఐపిఎల్ లో అరంగేట్రం చేశాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement