ఎలిమినేటర్ రౌండ్లో భాగంగా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి టాపార్డర్ తడబాటుకు గురయ్యింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే.. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ కీలక నాలుగు వికెట్లు తీసి ముంబయి వెన్నువిరిచాడు. ఆ తర్వాత యశ్ రవిసింగ్ ఠాకూర్ కూడా మూడు వికెట్లు తీశాడు.
ఇక.. ముంబయి టీమ్‌లో ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11), కామెరున్ గ్రీన్ (41), సూర్యకుమార్ యావ్ (33), తిలక్ వర్మ (26), టిమ్ డేవిడ్ (13) జోర్డాన్ (4) పరుగులు మాత్రమే చేయగలిగారు. వధేరా 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో వధేరా దంచికొట్టడంతో స్కోరు బోర్డు కాస్త మెరుగయ్యింది.
ఇక.. లక్నో టార్గెట్ 183 పరుగులుగా ఉంది.