మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇక పాయింట్స్ పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది.
పంజాబ్, ముంబై జట్లు ఇప్పటి వరకు 31 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్ లు గెలుపొందగా,ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోర్ 230 సాధించగా., పంజాబ్ పై ముంబై అత్యధిక స్కోరు 223 గా ఉంది. మొహాలిలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన పిచ్ లలో ఒకటి. ఇది పేసర్లుకు స్వర్గధామం లాంటి పిచ్.
ఇక నేడు ఆడే పంజాబ్ కింగ్స్ టీంలో అథర్వ తైడే, జానీ బెయిర్‌స్టో/రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, హర్షల్ పటేల్ రబడ, అర్ష్‌దీప్ సింగ్ , అశుతోష్ శర్మ లు ఉండవచ్చు. ఇక మరోవైపు
ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (Wk), సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ/నువాన్ తుషార, శ్రేయాస్ గోపాల్, జస్ప్రిత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్ ఆటగాళ్లు ఆడవచ్చు.