హైదరాబాద్, ముంబయి జట్ల మధ్య ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత 192 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. హైదరాబాద్కు 193 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది.
కాగా, హైదరాబాద్ బ్యాటర్లు తొలుత దీటుగా ఆడినా.. ఆ తర్వాత అంత జోరు చూపలేదు. దీంతో 178 పరుగులకే ఆల్ అవుటయ్యారు. ఇందులో.. మయాంక్ అగర్వాల్ (48), మార్క్రమ్ (22), క్లాసేన్ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ముంబయి జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.