లెజెండ్రీ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) సీజన్ 2 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ టోర్నమెంట్‌లో ఆడటానికి భారత స్పిన్ దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్ సుముఖత వ్యక్తం చేశారు. అతడితోపాటు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫీ మోర్తాజ కూడా లెజెండ్రీ లీగ్‌లో పాల్గొంటానని ప్రకటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌లో మంచి పేరుంది. మోర్తాజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణిస్తూ ఆయన నేతృత్వంలో చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు బంగ్లాదేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ స్టార్స్, లెండిల్ సిమన్స్, డినేష్ రాందిన్ తదితరులు సుముఖత వ్యక్తం చేశారు.
లెజెండ్రీ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా మీడియాతో మాట్లాడుతూ.. ”జట్టులోకి హర్భజన్‌కు స్వాగతం పలుకుతున్నాం… చాలా సంతోషంగా ఉంది. కొవిడ్ వల్ల జనవరిలో అతడిని మిస్ అయ్యాం. ప్రస్తుతం భజ్జీ వస్తున్నాడు, అతని స్పిన్ మాయాజాలం మళ్లిd మైదానంలో చూడబోతున్నాం” అని పేర్కొన్నారు. సీజన్ 2 లీగ్‌లోకి మరికొందరు లెజెండ్రీ క్రికెటర్లు రాబోతున్నారని రామన్ రహేజా ఆశాభావం వ్యక్తం చేశారు.