Saturday, November 23, 2024

ఐపీఎల్‌తో మరింత అనుబంధం: నీతా అంబానీ

ముంబై: ఐపీఎల్‌ ప్రచార హక్కుల సొంతం చేసుకుని, మరింత అనుబంధం పెరిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ నీతా అంబానీ పేర్కొన్నారు. 2023-2027 ఐదేళ్ల కాలానికి ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ”వయాకామ్‌-18” సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానులనుద్దేశిస్తూ నీతా అంబానీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ”దేశంలో ప్రతి క్రికెట్‌ అభిమానికి రిలయన్స్‌ సంస్థ వరల్డ్‌ క్లాస్‌ ఐపీఎల్‌ కవరేజ్‌ అందించేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం పూర్తి శక్తి సామర్థ్యాల మేరకు పనిచేస్తాం.

భారత్‌కు మరింత పేరు తెచ్చే ఈ ఐపీఎల్‌ లీగ్‌తో మా అనుబంధాన్ని పెంచుకోవడం మరింత గర్వకారణంగా ఉంది” అని నీతా అంబానీ పేర్కొన్నారు. ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన ”వయాకామ్‌-18”, టైమ్స్‌ ఇంటర్నెట్‌ సంస్థలు రూ.23,773 కోట్లకు సొంతం చేసుకోగా, టీవీ ప్రసార హక్కులను స్టార్‌ నెట్‌వర్క్‌ మరోసారి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement