టీ 20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులు, నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లతో కూడిన టీమిండియా బృందాన్ని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు ఎంపికపై అభిమానులతో పాటు పలువురు వి శ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రపంచకప్ జట్టులో మహమ్మద్ షమీకి అవకాశాలు లేవని వస్తున్న వార్తలను బీసీసీఐ సెలక్టర్ కొట్టిపారేశారు.
ప్రస్తుతం స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న షమీ త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లో హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలలో ఎవరు విఫలమైనా వారిస్థానంలో మహమ్మద్ షమీ వస్తాడని వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ల్లో షమీ సైతం రాణించాల్సి ఉంటుందని, ఇది జరిగితే ప్రపంచకప్‌లో షమీ ఆడటం కన్‌ఫర్మ్ అవుతుందని సెలక్టర్ వ్యాఖ్యానించాడు.