Tuesday, November 26, 2024

Breaking: డీలాపడ్డ గుజరాత్​ను ఆదుకున్న మిల్లర్​.. ఆఖరి బంతి దాకా ఉత్కంఠ!

చెన్నై, గుజరాత్​ జట్ల మధ్య ఇవ్వాల జరిగిన టీ20 మ్యాచ్​ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. ఆఖరికి డేవిడ్​ మిల్లర్​ సాహసోపేత బ్యాటింగ్​తో గుజరాత్​ టీమ్ ​మూడు వికెట్లతో విజయాన్ని కైవసం చేసుకుంది.


ఐపీఎల్‌లో భాగంగా గుజ‌రాత్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ ముగిసింది. ఇప్పటికే వ‌రుస ప‌రాజ‌యాల‌తో వెనుకంజ‌లో ఉన్న సీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 5 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది. గుజ‌రాత్ టైటాన్స్ ముందు ఓ మోస్తరు ల‌క్ష్యాన్ని ఉంచింది. కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ కూడా పెద్దగా ఆక‌ట్టుకోలేదు. 4 ఓవ‌ర్లకే మూడు కీల‌క వికెట్లు పోగొట్టుకుని క‌ష్టాల ముందు నిలిచింది. 8వ ఓవ‌ర్‌లో నాలుగో వికెట్ కూడా పోగొట్టుకుంది. 12.4వ ఓవర్​లో 5వ వికెట్​గా రాహుల్​ తివాతియా పెవిలియన్​ చేరాడు.  కాగా, గుజరాత్​ని డేవిడ్​ మిల్లర్​ ఆదుకున్నాడు. తన అద్భతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మిల్లర్​ కొట్టే షాట్స్​తో స్టేడియంలో సందడి నెలకొంది.

ప్రగుజ‌రాత్ స్కోరు 170/7 .. డేవిడ్​ మిల్లర్​ 94పరుగులతో ఆకట్టుకుని ఆధ్యంతం అలరించాడు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. పాయింట్ల పట్టిక‌లో అగ్ర స్థానంలో ఉండి ఫుల్‌ఫామ్‌లో దూసుకెళ్తున్న గుజ‌రాత్ ఆట‌గాళ్లు.. చెన్నై బ్యాట‌ర్లను ఆది నుంచే క‌ట్ట డి చేశారు. ప‌వ‌ర్ ప్లే పూర్త య్యేలోపే రెండు వికెట్లను తీశారు. రాబిన్ ఉత‌ప్ప (3), మొయిన్ అలీ (1) తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన‌ప్పటికీ.. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన రుతురాజ్ గైక్వాడ్ (73), అంబ‌టి రాయుడు (46) ఆదుకున్నారు. వీరిద్దరూ క‌లిసి 92 ప‌రుగులు చేశారు. వీరు ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన శివ‌మ్ ధూబే (19), ర‌వీంద్ర జ‌డేజా (22) కూడా రాణించారు. ఫ‌లితంగా నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఐదు వికెట్ల న‌ష్టానికి చెన్నై 169 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్‌కు 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement