ఈ సంవత్సరం చివరలో జరిగే టీట్వంటీ ప్రపంచకప్ ను ఇండియా గెలవాలంటే ఇంగ్లాండును ఓడించాల్సిందేనని అంటున్నాడు ఇంగ్లీష్ మాజీ కెఫ్టెన్ మైఖేల్ అథర్టన్. సొంత గడ్డపై టోర్నీ జరగడం ఇండియాకు కలిసి వచ్చే అంశమయినప్పటికి… ఇంగ్లాండును ని ఓడించడం కష్టమేనన్నాడు. భారత్ అన్ని అన్ని రంగాల్లో సమిష్టగా ఉన్నప్పటికి ఇంగ్లాండ్ జట్టును ఓడించాలంటే శ్రమించాల్సిందేనంటున్నాడు మైఖేల్ అథర్టన్. ఐపీఎల్ వల్ల భారత బ్యాటింగ్ విభాగం బలంగా తయారైందన్నాడు. ఏ స్థానంలో ఎవరైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. అందుకే వచ్చే టీట్వంటీ వరల్డ్ కఫ్ హాట్ ఫేవరెట్ లలో టీమిండియా ముందు వరుసలో ఉంటుందన్నాడు. అయితే ఇంగ్లాండును టీమిండియా ఏదో ఒక సమయంలో ఓడిస్తేనే వారిని కప్ వరిస్తుందని పేర్కొన్నాడు. తాజాగా జరిగిన టీట్వంటీ సిరీస్ లో టీమిండియా ఆడిన తీరు చూసిన తరువాత ఏ జట్టయిన వారితో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నాడు. ఇక టెస్టు, టీట్వంటీ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండు రేపటి నుంచి భారత్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. వన్డే సిరీస్ అయిన గెలిచి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండు సిద్దమవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement