అహ్మదాబాద్ స్టేడియంలో జరగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ చేస్తోంది. కాగా ఓపెనర్లు గిల్, సాహా స్కోరుబోర్డుని పరుగులు పెట్టించే క్రమంలో చెన్నై కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ మ్యాజిక్ చేశాడు. ఏడో ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన స్పిన్‌లో మూడు సార్లు గిల్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. అదే ఓవర్లో ఆఖరి బంతిని కవ్వించేలా వేయడంతో అది బ్యాట్‌ను తాకుతున్నట్టే వెళ్లి వికెట్ల వెనకాల ఉన్న ధోనీ చేతుల్లో పడింది. అయితే.. ఆ బాల్ని కొట్టేందుకు ఫ్రంట్ పూట్ తీసుకున్న గిల్ లెగ్‌ని క్రీజ్‌లో పెట్టకముందే క్షణంలో వెయ్యో వంతులో ధోనీ స్టంప్ బెల్స్ని గిరాటేసి చలాకీగా పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, స్టేడియంలోని జనం ఒక్కసారిగా అరుపులు, కేకలతో సంబురాలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement