ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రాజీనామాతో ఆ దేశ క్రికెట్ బోర్డు టెస్టు పగ్గాలను బెన్ స్టోక్స్‌కు అప్పగించింది. ఇక టెస్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో.. వైట్ బాల్ కోచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అన్వేషిస్తున్నది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్స్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌కు ఆడిన సమయంలో బెస్ట్ బ్యాటర్‌గా మెకల్లమ్ గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్‌ను గాడిలో పెట్టేందుకు మెకల్లమ్ బెటర్ అనే అంచనాకు ఈసీబీ వచ్చినట్టు సమాచారం. ఇటీవల నియమితులైన టెస్టు ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్.. 2011లో వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంగ్లండ్ కోచ్‌గా వచ్చేందుకు మెకల్లమ్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. కిర్‌స్టన్ లాగే.. మెక్ కల్లమ్ కూడా మంచి కోచ్. రెండు సార్లు ఐపీఎల్ టైటిల్స్‌తో మెరిసిన కేకేఆర్‌కు మెకల్లమ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. 2012లో కివీస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement