Tuesday, November 26, 2024

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ రేసులో మయాంక్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) డిసెంబర్‌ 2021 నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినేషన్ల జాబితాను శనివారం ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌, ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌స్టార్క్‌, న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ రేసులో నిలిచారు. రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్‌, కేఎల్‌ రాహుల్‌ డిసెంబర్‌లో గాయంతో టెస్టు మ్యాచ్‌లకు దూరమవడంతో ఓపెనర్‌గా మయాంక్‌కు లభించిన అవకాశాన్ని రెండుచేతులతో అందిపుచ్చుకుని సదినియోగం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రెండు మ్యాచ్‌ల్లో 69.00 సగటుతో 276పరుగులు చేశాడు.వీటిలో రెండు హాఫ్‌సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. భారత్‌-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో భారత సంతతికి చెందిన అజాజ్‌ పటేల్‌ ముంబై టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అద్భుతాన్ని పునరావృతం చేశాడు.

ఈ ఘనతను అందుకున్న జిమ్‌లేకర్‌, అనిల్‌కుంబ్లే తరాత మూడో బౌలర్‌గా అజాజ్‌ పటేల్‌ చరిత్ర సృష్టించాడు. లెఎn్టార్మ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ డిసెంబర్‌లో ఒకే టెస్టు ఆడినా 16.07 సగటుతో 14వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో బంతితో రాణించి ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో స్టార్క్‌ 14వికెట్లు తీయడంతోపాటు 58.50సగటుతో 117పరుగులు చేశాడు. తొలిటెస్టులో తొలి బంతికే రోరీబర్న్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. బ్యాటింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌తో కలిసి 8వ వికెట్‌కు 85కీలక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అడిలైడ్‌లో జరిగిన రెండోటెస్టులో 6వికెట్లు తీయడంతోపాటు 58పరుగులు సాధించాడు. బాక్సింగ్‌ డే టెస్టులో తొలిఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌తో సహా రెండు కీలక వికెట్లు తీశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement