Friday, November 22, 2024

అద్భుత సెంచ‌రీ సాధించిన మ‌యాంక్ అగ‌ర్వాల్

ముంబైలో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ అద్భుత సెంచ‌రీ చేశాడు. మ్యాచ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి భారత్ జట్టు ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ మ‌యాంక్ మాత్రం నిల‌దొక్కుకుని ఆడుతూ 196 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్ కు ఇది నాలుగో సెంచరీ. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వికెట్లు ప‌డ‌గొడుతుండ‌గా… మ‌యాంక్ నిబ్బరంగా ఆడి మంచి స్కోరును సాధించ‌గ‌లిగాడు. కానీ, అనూహ్య రీతిలో భారత్ 80 పరుగుల వద్ద వరుసగా గిల్, పుజారా, కెప్టెన్ కోహ్లీల వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు అజాజ్ పటేల్ కే దక్కాయి. ఆపై శ్రేయాస్ అయ్యర్ (18)తో కలిసి ఇన్నింగ్స్ ను పునర్ నిర్మించిన మయాంక్… స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక అయ్యర్ కూడా అజాజ్ పటేల్ కే వికెట్ అప్పగించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 65 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు. మయాంక్ 107, సాహా 24 పరుగులతో ఆడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement