ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాక్స్వెల్ సైతం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు అతిగా మద్యం సేవించాడు. దీంతో అస్వస్థతకు గురిరైన మాక్స్‌వెల్‌ను పబ్ నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు ఆసీస్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చాలా సీరియస్‌గా తీసుకుంది. అసలు అక్కడ ఏమైందనే విషయాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదే కారణంతో ఇవ్వాల ప్రకటించిన వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని పక్కన పెట్టినట్టు తెలుస్తొంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పక్కన బెట్టారని అంటుండగా.. సీఏ మాత్రం టీ20 సిరీస్‌లో అతడు ఆడతాడని, పని ఒత్తిడి కారణంతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చింది.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ జట్టులో రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చారు. స్టీవ్‌స్మిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మాక్స్‌వెల్‌తో పాటు జే రిచర్డ్సన్లను పక్కన పెట్టారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, గ్జావియర్ బార్ట్లెట్లను అవకాశం కల్పించారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్, అబాట్, గ్జావియర్ బార్ట్లెట్, ఆరోన్ హర్డీ, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, లాన్సే మోరిస్, మ్యాట్ షార్ట్, ఆడం జంపా.