బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్ట్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.
సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 157 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది.
ఓపెనర్లుగా వచ్చిన కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్ దూకుడుగా ఆడుతుండగా.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కొన్‌స్టాస్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 39 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ మార్నస్ లబుషేన్ కూడా ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ వెళ్లే బంతిని ఆడి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు లబుషేన్.అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన స్మిత్ 4 పరుగులకే వెనుదిరగగా.. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖావాజా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
అయితే దూకుడుగా ఆడుతున్న ఖావాజను 41 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కి చేరాడు. దీంతో 104 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన వెబ్ స్టార్ మిగిలిన టార్గెట్‌ని పూర్తి చేశాడు
. ఆసీస్ బ్యాటర్‌లలో ఉస్మాన్ ఖవాజా (41), వెబ్‌స్టర్ (39*), ట్రావిస్ హెడ్ (32*), కొన్‌స్టాస్ (22) టాప్ స్కోరర్‌లుగా నిలువగా.. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, సిరాజ్ ఒక వికెట్ అందుకున్నారు.
కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కలలన్నీ కల్లలయ్యాయి. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో చేజార్చుకోవడంతో తుది పోరుకు అర్హత సాధించే అవకాశాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. సిడ్నీ వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక అప్‌డేట్ అయింది.
భారత్ 50 పీసీటీ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 63.73 పీసీటీ పాయింట్లతో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పటికే 66.67 పీసీటీ పాయింట్లతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ మ్యాచ్‌లన్నీ ముగిసిపోయాయి. మిగతా జట్లకు కూడా ఫైనల్ చేరుకునే అవకాశాలు లేవు. దీంతో జూన్ 11 నుంచి 15 మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కాగా, సిడ్నీ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా… ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి డ్రా అవగా, మిగతా మ్యాచ్‌లు అన్నింటిలోనూ భారత్ పరాజయం పాలైంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.