నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై 4 ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వాన రాకతో అంతరాయం ఏర్పడింది. చిన్నగా మొదలై.. భారీ వర్షంగా మారింది. దాంతో మళ్లీ ఆటగాళ్లు మైదానం వీడాల్సి వచ్చింది. ఇంకా వర్షం పడుతుండటంతో.. క్రీడాభిమానులు బీసీసీఐని తప్పుబడుతున్నారు.
రుతుపవనాలు ఆరంభమయ్యే సమయంలో బెంగళూరులో మ్యాచ్లు ఎలా నిర్వహిస్తారని బీసీసీఐ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కాగా, వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత జట్టు 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో పంత్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాచ్ కనుక వర్షం కారణంగా రద్దయితే.. సిరీస్ను డ్రాగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు కప్పును రెండు బోర్డులూ పంచుకుంటాయి. కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ ఉంచుకుంటారని నిపుణులు చెప్తున్నారు.