ఈ గడ్డు పరిస్థితుల్లో ఐపీఎల్లో లేకపోవడం ఓ వరంగా భావిస్తున్నానని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు లబుషేన్. ప్రస్తుత ఐపీఎల్ బయోబబుల్‌ను సురక్షితంగా భావించనందునే తమ దేశ ఆటగాళ్లు తిరిగి వచ్చేస్తున్నారని అన్నాడు లబుషేన్. ఈ విషయాన్ని వారే తనతో స్వయంగా చెప్పారని వెల్లడించాడు. అలాగే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనవుతున్నారు. కానీ నేను అందరితో మాట్లాడలేదు. ఏది ఏమైనా వారంతా లీగ్‌ను ముగించుకొని సౌకర్యవంతగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నా’అని లబుషేన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ మెగాలీగ్ను తాను ఎంతో ప్రేమిస్తానని…కాని నాణానికి రెండు వైపులు ఉంటాయన్నారు. నేను ఈ లీగ్‌లో ఉన్నా ఆటకు దూరంగా ఉండేవాడినని చెప్పకొచ్చాడు. ఫిబ్రవరిలో చెన్నై వేదికగా జరిగిన మినీ వేలంలో లబుషేన్‌ను కొనుగోలు చేయడంపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కోటీ రూపాయల కనీస ధరకు అతను అందుబాటులో ఉన్నా.. టెస్ట్ ప్లేయర్ అనే కారణంతో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దాంతో అతను ఈ సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఇక యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్‌కు తాజా సీజన్‌కు చాలా తేడా ఉందని లీగ్‌ను వదిలి వెళ్లిన ఆడమ్ జంపా తెలిపాడు. యూఏఈ బబుల్‌లా సౌకర్యవంతంగా ఫీలవ్వలేకపోతున్నానని చెప్పాడు. అందుకే డబ్బుల కన్నా ప్రాణాలు, మానసిక ఫిట్‌నెస్ ముఖ్యమని లీగ్ నుంచి నిష్క్రమించానని తెలిపాడు.