ముంబయి ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ నియమితులయ్యాడు. జట్టు యాజమాన్యం శుక్రవారం ఈ విషయం ప్రకటించింది. ఇప్పటి వరకు ముంబై జట్టు కోచ్‌గా ఉన్న మహేలా జయవర్దనే స్థానంలోకి బౌచర్ వచ్చాడు. పంజాబ్‌కూడా తన జట్టు కోచ్‌ను మార్చుకుంది. కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రైవర్ బైలిన్‌ను నియమించింది. ముంబయి లీడ్ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇటీవల హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్దనే, భారత క్రికెటర్ మరో కీలక స్థానంలో ఉన్న జహీర్ ఖాన్‌ను తప్పించి.. వారికి గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫామెన్స్ , గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది.
మార్క్ నియామకం విషయాన్ని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్ర కటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ”మైదానం లోపల… వెలుపల బౌచర్‌కు ఉన్న అనుభవం జట్టును విజయపథంలో నడిపిస్తుంది” అని పేర్కొన్నారు.
పంజాబ్‌కు కోచ్‌గా ట్రైవర్ బైలిస్
పంజాబ్ జట్టు తన హెడ్ కోచ్‌ను మార్చింది. కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రైవర్ బైలిస్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టు ప్రకటించింది. ట్రైవర్ కోచింగ్‌లో ఇంగ్లండ్ జట్టు తన మొదటి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.