ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు కేవలం ఒక్క టీమ్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. రెండు టీమ్స్ అధికారికంగా ఎలిమినేట్ అయ్యాయి. కేకేఆర్ 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయ్యాయి. మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా 7 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ ఏడు టీమ్స్‌లో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది.
ఇలాంటి కీలక సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. టీ20 వరల్డ్ కప్‌కి ముందు తమ దేశం తరుఫున పాకిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు స్వదేశానికి వెళ్లిపోయారు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జోస్ బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీలు ఇంగ్లండ్‌కు పయనం అయ్యారు. వీరిలో జానీ బెయిర్ స్టో, సామ్ కరన్ వెళ్లిపోవడం వల్ల పంజాబ్‌కు పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే ఆ జట్టు ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది. కానీ, మొయిన్ అలీ లేకపోవడం సీఎస్‌కేకు, జోస్ బట్లర్ లేకపోవడం రాజస్థాన్ రాయల్స్‌కు, ఫిల్ సాల్ట్ లేకపోవడం కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ కానుంది. ఎందుకంటే.. ఈ ముగ్గురు ఆయా టీమ్స్‌లో కీలక ఆటగాళ్లు. వీళ్లు వెళ్లిపోతే.. ఆయా టీమ్స్‌లో రీప్లేస్‌మెంట్‌కు సరైన ప్లేయర్లు, వాళ్లకు సమానులు లేరు.
ఇక విల్ జాక్స్ లేకపోవడం ఆర్సీబీకి కూడా పెద్ద ఎదురుదెబ్బే అయినా ఆర్సీబీ వద్ద విల్ జాక్స్‌కు అద్భుతమైన రీప్లేస్‌మెంట్ ప్లేయర్ ఉన్నాడు. అతనే గ్లెన్ మ్యాక్స్‌వెల్. సీజన్ ఆరంభంలో మ్యాక్స్‌వెల్ విఫలం అవ్వడంతో అతని ప్లేస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చిన జాక్స్ బాగా ఆడాడు. ఇప్పుడు అతను వెళ్లి పోవడంతో మ్యాక్సీ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. మ్యాక్సీ ఫామ్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకౌట్, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ లాంటి మ్యాచ్‌లలో మ్యాక్సీ చాలా డేంజర్ ప్లేయర్. పైగా అలాంటి మ్యాచ్‌లలో ఎలా ఆడాలో ఆసీస్ ఆటగాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోవడం.. సీఎస్‌కే, ఆర్‌ఆర్, కేకేఆర్ లాంటి టీమ్స్‌ను ఇబ్బంది పెడుతుంటే.. ఆర్సీబీ మాత్రం సేఫ్‌గానే ఉంది. పైగా ఈ నెల 18న ఆర్సీబీ, సీఎస్‌కే మధ్య నాకౌట్ మ్యాచ్ జరగనుంది.