Monday, November 25, 2024

Manipur Clashes | పతకాలు వెనక్కి ఇచ్చేస్తామంటూ కేంద్రానికి అథ్లెట్ల లేఖ

జాతుల మధ్య వైరంతో మణిపుర్‌ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ పరిస్థితిపై అక్కడి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనకపోతే.. తమ పతకాలు వెనక్కి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లేఖ రాశారు. ఇందులో ఎనిమిది డిమాండ్లను బయటపెట్టారు. ఆ లేఖపై సంతకాలు చేసిన 11 మంది అథ్లెట్లలో ఒలింపిక్‌ మెడల్‌ విజేత మీరాబాయి చాను, పద్మా అవార్డు గ్ర#హత అయిన వెయిట్‌ లిప్టర్‌ కుంజారాణి దేవి, భారత మ#హళా ఫుట్‌బాల్‌ టీం మాజీ కెప్టెన్‌ బెం బెం దేవీ, బాక్సర్‌ ఎల్‌ సరితా దేవీ తదితర ప్రముఖులు ఉన్నారు.

కొద్దివారాలుగా పలు ప్రాంతాల్లో జాతీయ ర#హదారి-2ను బ్లాక్‌ చేశారు. దాంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించండి. లేకపోతే మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం’అని అమిత్‌ షాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement