Tuesday, November 26, 2024

Para-Badminton | భార‌త్‌కు ఫతకాల పంట.. మానసి జోషికి గోల్డ్‌

ఫజ్జా దుబాయ్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషన్‌ 2023 టోర్నీలో భారత షట్లర్లు, వరల్డ్‌ పారా-బ్యాడ్మింటన్‌ నం.2 ర్యాంక్‌డ్‌ జోడీ మానసి జోషి- తులసిమథీ మురుగేషన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఉమెన్స్‌ డబుల్స్‌ ఎస్‌13-ఎస్‌యూ5 కేటగిరిలో ఈజోడీ ప్రత్యర్థి ఇండోనేసియా జోడీ లీని రాత్రి ఒక్‌టిల్లా- ఖలిమటస్‌ సాదియహ్‌పై అద్భుతంగా రాణించింది. 15-21, 21-14, 21-6 తేడాతో భారత షటర్లు విజయం సాధించారు.

మెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో ప్రమోద్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ షట్లర్‌ డానియల్‌ బెథెల్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 21-17, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓటమిని చవిచూశాడు. సిల్వర్‌ మెడల్‌ చేజిక్కించుకున్నాడు. అటు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3, ఎస్‌యూ5 కేటగిరిలో ప్రమోద్‌- మనీషా రామ్‌దాస్‌ జోడీ ఇండోనేసియా షట్లర్లు హిక్మత్‌ రాందాని- లీని రాత్రి ఒక్‌టిల్లా చేతిలో 21-14, 21-11 తేడాతో ఓడిపోయారు. దీంతో వెండి పతకంతో సరిపెట్టుకున్నారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌ 3, ఎస్‌యు 5 కేటగిరిలో భారత షట్లర్లు కుమార్‌ నితీష్‌, తులసీమథి మురుగేషన్‌ రజత పతకం కైవసం చేసుకున్నారు. మెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 4 కేటగిరీలో సుహాస్‌ యథిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించగా, సుకాంత్‌ కడమ, తరుణ్‌లు రజత పతకాలు చేజిక్కించుకున్నారు. ఉమెన్స్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 4లో పాలక్‌ కోహ్లీ రజతంతో సరిపెట్టుకుంది. మెన్స్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌ 3, ఎస్‌ఎల్‌ 4 కేటగిరిలలో మనోజ్‌ సర్కార్‌, చో నదన్‌ (కొరియన్‌) జోడీ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకోగా, కుమార్‌ నితీశ్‌- తరుణ్‌ రజతం పతకంతో సరిపెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement