చెంగ్‌జౌ: చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మాల్విక బన్సోద్ పేను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో బన్సోద్.. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రపంచ ఏవ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మారిస్కా తున్‌జంగ్‌పై సంచలన విజయం సాధించింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ మాల్విక బన్సోద్ 26-24, 21-19 తేడాతో గ్రెగోరియా మారిస్కా తున్‌జంగ్ (ఇండోనేషియా)ను వరుస గేముల్లో చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బన్సోద్ తన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ విజయం… తొలిసారి ఓ ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి ఓడించింది. అయితే, ఇతర మ్యాచుల్లో మాత్రం భారత్‌కు భారీ నిరాశే మిగిలింది.