భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో 7వ సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 21-15 తేడాతో ఆతిథ్య జట్టు (మలేషియాకు చెందిన) అజ్రియాన్ అయుబ్ నూర్-టాన్ వీ కియోంగ్ జంటను వరుస గేముల్లో చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశారు.
- Advertisement -
అయితే, టోర్నీలోని మిగతా పోటీల్లో మాత్రం భారత్‌కు భారీ నిరాశ ఎదురైంది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ పోరాటం ప్రి క్వార్టర్స్‌లోనే ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత జంటలు ఓటమిపాలయ్యారు.