Saturday, January 11, 2025

Malaysian Open | సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ ఔట్

మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయారు. శనివారం జరిగిన సెమీస్‌ పోరులో… దక్షిణా కొరియాకు చెందిన వాన్‌ హో కిమ్‌-సియో సీయుంగ్‌ జే జంటతో త‌ల‌ప‌డిన భారత జోడీ 10-21, 15-21 పాయింట్ల‌తేడాతో ఓడిపోయింది.

దీంతో మలేషియా ఓపెన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. ఇప్పటికే సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ఓట‌మిపాలై ఇంటిబాట పట్టారు.

ఇక జనవరి 14 నుండి ప్రారంభమయ్యే ‘‘యోనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఓపెన్‌’’లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి పోటీ ప‌డ‌నున్నారు. ఈ టోర్నీలో రౌండ్ ఆఫ్ 32లో మలేషియాకు చెందిన వీ చోంగ్ మాన్ – కై వున్ టీతో తలపడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement