Friday, November 22, 2024

Sports | మలేషియా మాస్టర్స్‌.. పీవీ సింధు, కిదాంబి, ప్రణయ్‌, లక్ష్యసేన్‌ ముందంజ

మలేషియా మాస్టర్స్‌ 2023 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన గేమ్‌లో నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పివి సింధు మ#హళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్‌ క్రిస్టోఫర్‌సన్‌పై గట్టిపోటీతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఆక్సియాటా ఎరీనాలో ఆడుతున్న ప్రపంచ 13వ ర్యాంకర్‌ పీవీ సింధు, 32వ రౌండ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ డేన్‌ షట్లర్‌పై 21-13, 17-21, 21-18తో విజయం సాధించింది. సింధు గురువారం జరిగే రౌండ్‌-16లో జపాన్‌కు చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్‌ అయా ఒ#హూరితో తలపడనుంది.

ఇతర మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లలో, బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న ఆకర్షి కశ్యప్‌, మొదటి గేమ్‌లో జపాన్‌కు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌, ప్రపంచ నం. 1 అకానె యమగుచిని సాగనంపారు. అయితే చివరికి పోటీలో 21-17, 21-12 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ 50వ ర్యాంకు క్రీడాకారిణి అష్మితా చలిహా 21-17, 21-7తో ప్రపంచ 9వ ర్యాంకర్‌ చైనాకు చెందిన హాన్‌ యుయె చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుతం 23వ ర్యాంక్‌లో ఉన్న మాజీ ప్రపంచ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ 21-12, 21-16తో ప్రపంచ 28వ ర్యాంక్‌ ఆటగాడు తోమా జూనియర్‌ పోపోవ్‌పై గెలిచాడు.

భారతదేశపు అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్‌ ఆటగాడు మరియు ప్రపంచ నం. 9 హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న చౌను 16-21, 21-14, 21-13 స్కోరుతో ఓడించాడు. తదుపరి రౌండ్‌లో చైనాకు చెందిన షి ఫెంగ్‌ లీతో తలపడనున్నాడు.

- Advertisement -

కిదాంబి శ్రీకాంత్‌ ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్‌ పోపోవ్‌ను 21-12, 21-16తో ఓడించాడు. అతను తదుపరి మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్‌ విటిడ్సర్న్‌తో తలపడనున్నాడు. లక్ష్య సేన్‌ తన ప్రారంభ రౌండ్‌ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్‌ కీన్‌ యూ లోహ్‌ను 21-10, 16-21, 21-9తో ఓడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement