మలేషియా మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన గేమ్‌లో నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మ#హళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్‌సన్‌పై గట్టిపోటీతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఆక్సియాటా ఎరీనాలో ఆడుతున్న ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు, 32వ రౌండ్లో ప్రపంచ 33వ ర్యాంకర్ డేన్ షట్లర్‌పై 21-13, 17-21, 21-18తో విజయం సాధించింది. సింధు గురువారం జరిగే రౌండ్-16లో జపాన్‌కు చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒ#హూరితో తలపడనుంది.
ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో, బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న ఆకర్షి కశ్యప్, మొదటి గేమ్‌లో జపాన్‌కు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నం. 1 అకానె యమగుచిని సాగనంపారు. అయితే చివరికి పోటీలో 21-17, 21-12 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ 50వ ర్యాంకు క్రీడాకారిణి అష్మితా చలిహా 21-17, 21-7తో ప్రపంచ 9వ ర్యాంకర్ చైనాకు చెందిన హాన్ యుయె చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుతం 23వ ర్యాంక్‌లో ఉన్న మాజీ ప్రపంచ నం.1 కిదాంబి శ్రీకాంత్ 21-12, 21-16తో ప్రపంచ 28వ ర్యాంక్ ఆటగాడు తోమా జూనియర్ పోపోవ్‌పై గెలిచాడు.
భారతదేశపు అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్ ఆటగాడు మరియు ప్రపంచ నం. 9 హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న చౌను 16-21, 21-14, 21-13 స్కోరుతో ఓడించాడు. తదుపరి రౌండ్లో చైనాకు చెందిన షి ఫెంగ్ లీతో తలపడనున్నాడు.
కిదాంబి శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పోపోవ్‌ను 21-12, 21-16తో ఓడించాడు. అతను తదుపరి మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సర్న్తో తలపడనున్నాడు. లక్ష్య సేన్ తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్ కీన్ యూ లోహ్‌ను 21-10, 16-21, 21-9తో ఓడించాడు.