Friday, November 22, 2024

అమెరికాలో మేజర్​ క్రికెట్​ లీగ్​.. క్రికెట్‌ బిజినెస్​లోకి సత్య నాదెళ్ల..

సత్య నాదెళ్ల.. మైక్రో సాఫ్ట్‌ సీఈఓ.. క్రికెట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. అమెరికాలో క్రికెట్‌ అభిమానులు పెరుగుతున్నారు. క్రికెట్‌ వీక్షిచేందుకు అమెరికన్‌లు ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీంతో క్రికెట్‌పై పెరుగుతున్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని అమెరికా టీ20 లీగ్‌ను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి మేజర్‌ క్రికెట్‌ లీగ్‌గా నామకరణం చేశారు. ఈ లీగ్‌ కోసం నిర్వాహకులు.. 120 మిలియన్‌ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్‌ డాలర్లు జమ చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని 12 నెలల్లో సమకూర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిధులతో అమెరికాలో భారీ క్రికెట్‌ మైదానాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభించాలని సత్య నాదేళ్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే అమెరికా క్రికెట్‌ నుంచి అనుమతులు పొందారు. అమెరికాలో టోర్నీని సక్సెస్‌ చేసి.. అంతర్జాతీయ మ్యాచులకు కేంద్రంగా మార్చాలనే ఆలోచనలో అక్కడి కంపెనీలు ఉన్నట్టుసమాచారం. మేజర్‌ క్రికెట్‌ లీగ్‌లో సత్య నాదెళ్లతో పాటు వెంకి హరినారా యణ్‌ (మిల్లివేస్‌ వెంచర్స్‌ అండ్‌ రాకెట్‌షిప్‌ వీసీలో సహ వ్యవస్థా పకులు), ఆనంద్‌ రాజరామన్‌, మడ్రోనా వెంచర్‌ గ్రూప్‌ ఎండీ సోమ సోమసెగార్‌, సంజయ్‌ గోవిల్‌ (ఇన్ఫినౖౖెట్‌ కంప్యూట ర్‌ సొల్యూష న్స్‌ వ్యవస్థాపకుడు), తన్వీర్‌ అహ్మద్‌, అనురాగ్‌ జైన్‌, బహెటి ఫ్యామిలీ, శాంతాను నారాయణ్‌ లాంటి ప్రముఖులు భాగస్వాములు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement