ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ హెడ కోచ్‌గా శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ మహేళ జయవర్దనే మళ్లి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 2025 సీజన్ నుంచి జయవర్ధన మరోసారి ఎమ్‌ఐ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతుల చేపట్టనున్నాడు.
కాగా జయవర్దనే ఇప్పటికే ముంబై జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అతను 2017 నుంచి 2022 వరకు ఎమ్‌ఐకి హెడ్ కోచ్‌గా సేవలందించాడు. అనంతరం జయవర్దనేకు ఎమ్‌ఐ యాజమాన్యం మరో కీలక పదవి అప్పజెప్పింది. దీంతో తర్వాతి సీజన్‌లో అతడి స్థానంలో మార్క్ బౌచర్ హెడ్ కోచ్‌గా పని చేశాడు.
అయితే హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 2024 ఘోరంగా విఫమైంది. ఈ నేపథ్యంలో మార్క్ బౌచర్‌పై వేటు వేసిన ముంబై ఫ్రాంచైజీ మళ్లి మాజీ కోచ్ జయవర్దనేకు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. ఇక కొద్ది రోజుల క్రితమై టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించింది.