మేడిన్ ఇండియా ట్యాగ్‌లైన్
బ్యాక్ బే ఇండియా కంపెనీ ఉత్పత్తి
క్రీడా గ్రామంలో ప్రత్యేక స్టాల్
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఫ్యాక్టరీ
90శాతం కాటన్ వినియోగం
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారీ
ఈ విజయం తల్లీ, కూతుళ్ల శ్రమకు నిదర్శనం
పారిస్ ఒలింపిక్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. జులై 26న ప్రారంభమై ఈ విశ్వ క్రీడా పోటీల్లో అమెరికా, చైనా పతకాల వేట కొనసాగిస్తున్నాయి. భారత్‌కు ఒక సిల్వర్, అయిదు కాంస్య పతకాలు దక్కాయి. ఇక.. పారిస్‌కి దాదాపు 8,000 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరుప్పూర్‌కు పారిస్‌కు ఉన్న అనుబంధం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) రిటైల్ చానెల్స్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ అని లేబుల్ ఉన్న దుస్తులు కనిపిస్తున్నాయి. వీటిని చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే.. తిరుచ్చికి చెందిన దీపా జయన్, ఆమె కూతురు ఐశ్వర్య నిర్వహిస్తున్న సంస్థ నుంచి తయారై వచ్చినయే ఈ దుస్తులు. వీరి మేనేజ్‌మెంట్‌లో టెక్స్‌టైల్ హబ్ ‘బ్యాక్ బే ఇండియా’ ద్వారా ఉత్పత్తి చేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
బ్యాక్ బే ఇండియా..
బ్యాక్ బే ఇండియా భారతదేశంలోని తిరుప్పూర్‌లో ఉన్న పాపులర్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది యూరప్, ఇతర పశ్చిమ దేశాలకు వివిధ రకాల దుస్తులు, గృహ వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. భారతదేశం 90శాతం కాటన్ నిట్‌వేర్ ఎగుమతులు తిరుప్పూర్ నుంచే ఉంటాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన కార్మికులను తిరుప్పూర్ లోని ఈ సంస్థ ప్రత్యేకం అనే చెప్పుకోవాలి.
పారిస్‌లో ఒలింపిక్ వస్తువులను విక్రయించే స్టాల్..
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాక్ బే ఇండియా తనదైన ముద్ర వేసింది. కంపెనీకి పారిస్‌లో ఒలింపిక్ వస్తువులను విక్రయించే షాప్ కూడా ఉంది. వారి ఉత్పత్తులు స్టేడియంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక.. ఆగస్టు 28న ప్రారంభమయ్యే పారాలింపిక్ క్రీడలకు సామగ్రిని కూడా ఈ స్టాల్‌లో అందజేస్తున్నారు. దీపా జయన్, ఆమె కుమార్తె ఐశ్వర్య వారి టెక్స్‌టైల్ టౌన్ కార్యాలయంలో పారిస్‌కు తమ చివరి కార్గో దుస్తులను పంపించారు. వారు దాదాపు మిలియన్ పీస్‌లు రవాణా చేశారు.