యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరిసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియన్ 400వికెట్ల క్లబ్‌లో చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో లయన్ 4వికెట్లు తీశాడు. ఈక్రమంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడం ద్వారా 400వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 400వికెట్లు తీసిని మూడో బౌలర్‌గా లియన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ 708 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 563వికెట్లుతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా వీరి సరసన లియన్ నిలిచాడు. కాగా లియన్ ఒక్క వికెట్ దక్కించుకోవడం కోసం సుమారు 10నెలలుపైనే నిరీక్షించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్-ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేసిన లియన్ 399వ వికెట్ దక్కించుకున్నాడు. శనివారం డేవిడ్ మలన్ వికెట్ తీయడం ద్వారా 400వ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం లయన్ ఖాతాలో వికెట్ల సంఖ్య 403కు చేరుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement