Thursday, November 21, 2024

అహ్మాదాబాద్ లో అన్న‌ద‌మ్ముల స‌వాల్ ….జిటి పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ల‌క్నో

అహ్మ‌దాబాద్ లో నేడు జర‌గ‌నున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ల‌క్నో రెగ్యుల‌ర్ కెప్టెన్ రాహుల్ గాయ‌ప‌డి టోర్ని నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈ జ‌ట్టుకి కునాల్ పాండ్యా నాయ‌కత్వం వ‌హిస్తున్నాడు.. మ‌రికాసేప‌టిలో హ‌ర్ధిక్ పాండ్యా జ‌ట్టు బ్యాటింగ్ కు దిగ‌నుంది..
ఇది ఇలా ఉంటే ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సోదరులుగా మాత్రం హర్దిక్ పాండ్య, కృనాల్‌ పాండ్య రికార్డు సృష్టించారు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ నాయకత్వం వహిస్తుండగా.. తాజాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీతో కృనాల్ పాండ్య లఖ్‌నవూ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.

ల‌క్నోకి క‌ష్లాలు ..

రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్‌ లేకపోవడం లఖ్‌నవూకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్లు గొప్పగా రాణించలేకపోయారు. ఆ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడం వల్ల కనీసం ఒక్క పాయింట్‌తోనైనా సరిపెట్టుకోగలిగింది. ఇలాంటి సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌కు లఖ్‌నవూ అడ్డుకట్ట వేయాలంటే మరింత శ్రమించాలి. అప్పుడే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. కెప్టెన్సీ చేపట్టిన కృనాల్‌ పాండ్య డ‌మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. గత సీజన్‌లో రెండు సార్లు, ఈ సారి ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో ఇరు జట్లూ తలపడ్డాయి. మూడింట్లోనూ గుజరాతే విజయం సాధించడం గమనార్హం. ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో లఖ్‌నవూ బరిలోకి దిగనుంది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో కరుణ్‌ నాయర్‌ వచ్చినప్పటికీ.. తుది జట్టులో మాత్రం డికాక్‌ వచ్చే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రాతో కూడిన స్పిన్‌ త్రయం గుజరాత్‌ బ్యాటర్లను అడ్డుకోగలిగితే లఖ్‌నవూ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.

తిరుగులేని గుజరాత్‌.

- Advertisement -

గుజరాత్ టైటాన్స్‌ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లేఆఫ్స్ రేసులో ముందుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానం వరకూ అదరగొట్టగలిగే ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు చేజేతులా ఓటములను చవిచూసింది. రాజస్థాన్‌పై రెచ్చిపోయిన కెప్టెన్ హార్దిక్‌ పాండ్య అంతకుముందు ఢిల్లీపై మాత్రం నిదానంగా బ్యాటింగ్‌ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో రషీద్, నూర్ అహ్మద్‌, షమీ, మోహిత్ శర్మ, హార్దిక్‌ ప్రత్యర్థులను కట్టడి చేసేస్తున్నారు. అయితే, లఖ్‌నవూ బ్యాటింగ్ ఆర్డర్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ ఆడని క్వింటన్‌ డికాక్‌ పరుగుల దాహంతో ఉన్నాడు. ఇక కేల్‌ మేయర్స్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్‌ అద్భుత ఫామ్‌తో పరుగులు చేస్తున్నారు. కృనాల్‌, దీపక్ హుడా కూడా డేంజరస్‌ బ్యాటర్లే. ఈ క్రమంలో లఖ్‌నవూ బ్యాటింగ్‌.. గుజరాత్‌ బౌలింగ్‌కు మధ్య మంచి పోరాటం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్లో బౌలర్లు ప్రభావం చూపుతారని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా.

జట్లు
గుజరాత్: శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్‌ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ
లఖ్‌నవూ: క్వింటన్ డికాక్, కేల్ మేయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్‌ పూరన్, కృనాల్ పాండ్య (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్‌ ఖాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement