Tuesday, September 17, 2024

Paris Olympics | సింధూ, ప్ర‌ణ‌య్‌ల‌కు ల‌క్కీ ఛాన్స్…

పారిస్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లకు సులువైన డ్రా ఎదురైంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో క్రీడల్లో కాంస్యంతో మెరిసిన సింధు పారిస్‌లో పదో సీడ్‌గా బరిలో దిగనుంది. మహిళల సింగిల్స్‌లో గ్రూప్‌-ఎమ్‌లో సింధుతో పాటు క్రిస్టిన్‌ కూబా (ఈస్తోనియా), ఫాతిమత్‌ నబాహా (మాల్దీవులు)కు చోటు దక్కింది. సునాయాసంగా గ్రూపు దశ దాటే అవకాశమున్న సింధు.. ప్రిక్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్‌ హి బింగ్‌ జియావో (చైనా)తో తలపడొచ్చు.

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌.. లీ డక్‌ఫాట్‌ (వియత్నాం), ఫాబియన్‌ రోత్‌ (జర్మనీ)తో కలిసి గ్రూపు-కెలో స్థానం సంపాదించాడు. గ్రూపు-ఎల్‌లో లక్ష్యసేన్, జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా), కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా), జూలియెన్‌ కరాజి (బెల్జియం) ఉన్నారు.

తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిస్తే ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్, లక్ష్యసేన్‌ పోటీపడే అవకాశముంది. క్రీడల ఆర్బిట్రేషన్‌ కోర్టు (సీఏఎస్‌)లో కేసు ఉన్నందున పురుషుల డబుల్స్‌ డ్రా వాయిదా పడింది. భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి మూడో సీడ్‌గా బరిలో దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement