Saturday, November 23, 2024

ఆర్సీబీ కి షాక్ – లక్నో కి థ్రిల్లింగ్ విక్టరీ

బెంగుళూరు – చిన్న‌స్వామి స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. భారీ స్కోర్లు న‌మోదైన ఈ మ్యాచ్‌లో ల‌క్నో సూపర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. నికోల‌స్ పూర‌న్(62), స్టోయినిస్(65) సునామీలా ఆర్సీబీ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. దాంతో, 213 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆఖ‌రి ఓవ‌ర్‌లో చేదించింది. సొంత గ్రౌండ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓట‌మి పాలైంది.ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. 20వ ఓవ‌ర్‌లో విజ‌యానికి 5 ప‌రుగులు కావాలి. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వుడ్‌ను బౌల్డ్ చేశాడు. మూడో బంతికి బిష్ణోయ్ రెండు ర‌న్స్ తీశాడు. భారీ షాట్ కొట్టిన‌ ఉనాద్కాట్(9) క్యాచ్ ఔట‌య్యాడు. అవేశ్ ఖాన్ సింగిల్ తీయ‌డంతో ల‌క్నో అనూహ్యంగా గెలిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (79*; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) ముగ్గురూ అర్ధ శతకాలు బాదడంతో తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చివరి ఏడు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 108 పరుగులు రాబట్టారు. అమిత్‌ మిశ్రా వేసిన 12 ఓవర్లో మూడో బంతికి కోహ్లీ.. స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్‌వెల్.. మార్క్‌వుడ్ వేసిన చివరి ఓవర్లో ఐదో బంతికి క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది

. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని లఖ్‌నవూ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి వరకు పోరాడి ఛేదించింది. నికోలస్‌ పూరన్‌ (62; 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 105 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లఖ్‌నవూను నికోలస్‌ ఆదుకుని విజయం దిశగా నడిపించాడు. సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పూరన్‌ 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కీలక సమయంలో పూరన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. ఉనద్కత్‌ వేసిన చివరి ఓవర్‌లోలఖ్‌నవూ విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా.. రెండో బంతికి మార్క్ వుడ్ (1), ఐదో బంతికి ఉనద్కత్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (9) ఔట్ కావడంతో మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. చివరి బంతికి బైస్‌ రూపంలో ఒక పరుగు రావడంతో లఖ్‌నవూ శిబిరం సంబరాల్లో మునిగి తేలింది. పూరన్. (65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా రాణించాడు. బదోని (30) పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌ 3, పార్నెల్ 2, కర్ణ్ శర్మ 1 వికెట్ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement