చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో చిక్కుల్లో పడిపోయింది. తొలి ఆరు ఓవర్ల వరకు బాగానే ఆడిన ఈ జట్టు బ్యాటర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ మంచి శుభ ఆరంభాన్ని ఇచ్చారు. మేయర్స్ వరుసగా హిట్స్ చేస్తూ సిక్సులు, ఫోర్లు బాది రన్‌రేట్ 15వరకు పెంచేశాడు. దీంతో 5 ఓవర్లలో 75 పరుగులను దాటేసింది.
ఇక.. ఫాస్ట్ బౌలర్లను అయితే చితక్కొడుతున్నారు అనుకున్న చెన్నై కెప్టెన్ ధోని.. స్పిన్నర్లను రంగంలోకి దించాడు. దీంతో మోయిన్ అలీకి చాన్స్ వచ్చింది. దీంతో అలీ బౌలింగ్‌లో సిక్స్ బాదబోయిన మెయిర్స్ (53) బోర్డర్ వద్ద కాన్వేకి అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత స్పిన్నర్ శాంత్నర్ బౌలింగ్‌లో దీపక్ హుడా (2) కూడా సేమ్ టు సేమ్ బోర్డర్ వద్ద బెన్ స్టోక్ట్స్‌కి చిక్కాడు. మరో ఓవర్‌లో మోయిన్ అలీకి కేఎల్ రాహుల్ (20) దొరికిపోయాడు. దీంతో 8.2 ఓవర్లలో లక్నో 83 పరుగులు చేసి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. 218 పరుగుల టార్గెట్ ఛేదనలో తబడాటుకు గురవుతోంది.