ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఇవ్వాల జరుగుతున్న టాటా ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయ్సల్, లక్నో సూపర్ జేయింట్స్ తలపడుతున్నాయి. కాగా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌కు దిగిన లక్నో త్వర త్వరగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునేలా కనిపించడం లేదు. పవర్‌ప్లే ముగిసేలోపే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును దీపక్ హుడా (25) ఆదుకున్నట్లే కనిపించాడు. రిస్కీ షాట్లు ఆడకుండా ఓపెనర్ డీకాక్ (17 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేలా కనిపించాడు.
కానీ పదో ఓవర్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హుడా.. బంతిని మిస్ అయ్యాడు. దాంతో ఆ బంతి వికెట్లను కూల్చింది. దీపక్ హుడా నిరాశగా మైదానం వీడగా.. రాజస్థాన్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్న లక్నో ప్లేయర్లలో హుడా ఒకడన్న విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఆదుకుంటూ వచ్చిన హుడా కూడా అవుటవడంతో లక్నో విజయావకాశాలు దెబ్బతిన్నట్లే కనిపిస్తోంది. అయితే క్రీజులో క్వింటన్ డీకాక్ ఉండటంతో ఇంకా అభిమానుల్లో గెలుపు ఆశలు చావలేదు. ప్రస్తుతం 14.3 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.